నేరాల నియంత్రణ
సాక్షి, మహబూబాబాద్: 2025 సంవత్సరంలో నేరాలు నియంత్రణలోనే ఉన్నాయి. గడిచిన ఏడాది జిల్లాలో పాత నేరాలకు బదులు కొత్తరకం నేరాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే మొత్తంగా కేసుల సంఖ్య తగ్గినా.. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. నూతన టెక్నాలజీని వినియోగించుకొని నిందుతులు నేరాలకు పాల్పడగా.. పోలీసులు అదేస్థాయిలో రికవరీ చేసేందుకు పోటీ పడ్డారు. మొత్తంగా 65 శాతం కేసుల్లో శిక్ష పడింది. అదేవిధంగా మహిళలపై అత్యాచారాలు, బాలికల కిడ్నాప్ మొదలైన కేసులు నమోదు కాగా.. అందులో కొందరికి శిక్ష పడింది.
తగ్గిన కేసులు..
2024లో మొత్తం 4,375 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాదిలో 4,275 కేసులు మాత్రమే నమోదు చేశారు. అంటే గత ఏడాదితో పోలిస్తే 100కు పైగా కేసులు తగ్గినట్లు స్పష్టంగా కన్పిస్తుంది.
పెరిగిన రోడ్డు ప్రమాదాలు
జిల్లా వ్యాప్తంగా 2025 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా నమోదైంది. రోడ్డు ప్రమాదంలో గత సంవత్సరం, ఈ సంవత్సరం సమానంగా 121 మంది మరణించారు. అదే విధంగా గతఏడాది 134మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడగా.. ఈ ఏడాది 159 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా స్వల్పగాయాలతో బయట పడిన ప్రమాదాలు గత ఏడాది 19 ఉంటే ఆ సంఖ్య 37కు చేరింది. అయితే ఇందులో అత్యధికంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంతో వెళ్లి ప్రమాదాల బారిన పడినవారే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, అవగాహన ర్యాలీలు, ట్రాఫిక్ కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించింది.
మహిళలపై పెరిగిన నేరాలు
మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, కిడ్నాపులు, హత్యల కేసులు గతంతో పోలిస్తే పెరిగాయి. గత ఏడాది 43 అత్యాచార కేసులు నమోదు కాగా.. వాటి సంఖ్య 55కు పెరిగింది. అదే విదంగా కిడ్నాపులు 42 నుంచి 54కు చేరాయి. ఈ కేసుల్లో 11 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఒకరికి, 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరోకేసులో విధించగా.. ఇతర చిన్న కేసులకు సైతం ఆయా స్థాయిలో శిక్షలు పడ్డాయి. బాలికల లైంగిక కేసుల విషయంలో సున్నితంగా దర్యాప్తు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు.
ఆర్థిక మోసాలు
జిల్లాలో ఆర్థిక మోసాలకు సంబంధించి మొత్తంగా 633 ఫిర్యాదులు నమోదు కాగా, బాధితులు మొత్తం రూ.4.65 కోట్లు కోల్పోయారు. సకాలంలో చర్యలు తీసుకోవడం ద్వారా రూ.1.06 కోట్లు (354 ఫిర్యాదులు) హోల్డ్ చేయబడింది. ఈ కేసుల్లో 200 ఫిర్యాదులపై కేసులు నమోదు చేయగా, 153 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. న్యాయస్థానాల ఆదేశాల మేరకు 212 ఫిర్యాదులకు సంబంధించిన రూ.60.26 లక్షల రీఫండ్‌ను బాధితులకు అందించేలా చర్యలు చేపట్టబడింది. ఆర్థిక మోసాలు కాకుండా.. మొత్తం 188 ఫిర్యాదులు నమోదయ్యాయి.
తగ్గిన కేసులు,
పెరిగిన రోడ్డు ప్రమాదాలు
కోర్టు కేసుల్లో 65 శాతం శిక్షలు
సైబర్ నేరాలపై ప్రత్యేక విశ్లేషణ
ఆస్తుల చోరీలో రూ.1.13 కోట్లు రికవరీ
మహిళలు, పిల్లల రక్షణపై
ప్రత్యేక చర్యలు
కేసులు 2024 2025
చోరీలు 159 148
చీటింగ్ 256 268
హత్యాయత్నం 28 28
హత్యలు 16 21
రోడ్డు ప్రమాదాలు 274 317
ఇతర బీఎన్‌ఎస్ 941 1,198
ఎస్‌ఎల్‌ఎల్ 1099 492
మిస్సింగ్ 211 258
నేరాల నియంత్రణ
నేరాల నియంత్రణ
నేరాల నియంత్రణ
నేరాల నియంత్రణ
నేరాల నియంత్రణ


