డయల్ యువర్ డీఎంకు స్పందన
తొర్రూరు: ఆర్టీసీ అధికారులు శనివా రం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 15 కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వేములవాడకు ప్రత్యేక సర్వీస్ నడపాలని, దంతాలపల్లిలో మరుగుదొడ్లను వినియోగంలోకి తేవా లని, కేసముద్రం వరకు బస్సులు నడపాలని పలువురు కోరారు. అన్నారం, పెరికేడు మీదుగా వరంగల్‌కు సర్వీస్ వేయాలని, బీరిశెట్టిగూడెంలోని రిక్వెస్ట్ స్టాప్‌లో బస్సులు నిలపాలని, బస్సులు సమయ పాలన ప్రకారం నడిచేలా చూడాలని విజ్ఞప్తులు వచ్చినట్లు డీఎం పద్మావతి తెలిపారు.
దరఖాస్తు చేసుకోవాలి
గూడూరు: అర్హులైన ఎస్సీ విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లో శనివారం ఆయన మాట్లాడారు. ఐదో తరగతి నుంచి 8వ తరగతి బాలురకు రూ.1,000, బాలికలకు రూ.1,500 చొప్పున స్కాలర్‌షిప్ ఉంటుందని, 9, 10వ తరగతి బాలబాలికలకు రూ.3,500 చొప్పున స్కాలర్‌షిప్ ఉంటుందని తెలిపారు. అర్హులైన డే స్కాలర్ విద్యార్థులు కులం, ఆదాయం సర్టిఫికెట్లతోపాటు ఆధార్, బ్యాంకు అకౌంట్ వివరాలతో స్కాలర్‌షిప్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం మండలంలోని ఊట్ల మట్టెవాడ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలతోపాటు సీతానగరంలో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ముందుగా ఆహార పదార్థాలు, వండిన ఆహారాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి తెలిపారు. ప్రత్యేక తరగతులతో పదో తరగతి విద్యార్థులు ఉన్నత శ్రేణిలో రాణించేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రవికుమార్, హెచ్‌ఎం శరత్‌బాబు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
హేమాచలుడి సన్నిధిలో
అడ్వకేట్ జనరల్
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి కుటుంబ సబ్యులతో కలిసి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ ఈఓ మహేశ్, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారి కి ఆయన గోత్రనామాలతో అర్చన జరిపించా రు. ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను ఆలయ అర్చకులు వివరించి వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
రామప్పలో భక్తుల సందడి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టత గురించి గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్‌లు వివరించారు. రామప్ప ఆలయాన్ని సందర్శించిన అనంతరం సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోటింగ్ చేస్తూ సరస్సు అందాలను తిలకించారు.
గోదావరి వెంట హెలికాప్టర్ చక్కర్లు
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కాళేశ్వరం గోదావరి వెంట ఓ హెలికాప్టర్ శనివారం చక్కర్లు కొట్టింది. ఆ హెలికాప్టర్‌పై పోలీసులకు ఎలాంటి సమాచారమూ లేదు. గోదావరి పొడవునా సంచరించిన హెలికాప్టర్ సమీపంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సంబంధించినదని పలువు రు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో వారానికి రెండు మూడు సార్లు వీఐపీ, వీవీఐపీ, పోలీసు అధికారులు నిత్యం హెలికాప్టర్‌లపై విహంగ వీక్షణం చేయడం జనం గుర్తు చేసుకుంటున్నారు. ఆ హెలికాప్టర్ ఎక్కడిదని పోలీసులు కూడా ఆరాతీస్తున్నట్లు సమాచారం.
డయల్ యువర్ డీఎంకు స్పందన
డయల్ యువర్ డీఎంకు స్పందన


