ముగిసిన రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు
● సీనియర్స్‌లో మహబూబాబాద్
జట్టుకు ప్రథమస్థానం
కేసముద్రం: కేసముద్రం మున్సిపల్ పరిధి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు మూడో రోజు శనివారం ముగిశాయి. సీనియర్స్ విభాగంలో (పురుషులు) మహబూబాబాద్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. నారాయణపేట ద్వితీయ స్థానం, నల్గొండ, మహబూబ్‌నగర్ జట్లు సంయుక్తంగా తృతీయస్థానంలో నిలిచాయి. సీ్త్రల విభాగంలో మేడ్చల్ జట్టు ప్రథమస్థానం, మహబూబ్‌నగర్ ద్వితీయస్థానం, రంగారెడ్డి, నల్గొండ జట్లు తృతీయస్థానంలో నిలిచా యి. పాస్ట్‌ఫైవ్ విభాగంలో(పురుషులు) మహబూ బ్‌నగర్ ప్రథమస్థానం, ఖమ్మం ద్వితీయస్థానం, కరీంనగర్, మేడ్చల్ జట్లు తృతీయస్థానంలో నిలిచా యి. సీ్త్రల విభాగంలో మేడ్చల్ ప్రథమస్థానంలో నిలవగా, ఖమ్మం జట్టు ద్వితీయ, రంగారెడ్డి, అసీ ఫాబాద్ జట్లు తృతీయస్థానంలో నిలిచాయి. మిక్స్ డ్ విభాగంలో మేడ్చల్ ప్రథమస్థానంలో, మహబూబ్‌నగర్ ద్వితీయస్థానం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జట్లు తృతీయస్థానంలో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం విజేతలకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు విక్రమ్‌ఆదిత్యారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరీషారాణి, జిల్లా అధ్యక్షుడు వేం వాసుదేవరెడ్డి, ప్రధానకార్యదర్శి తుమ్మ సురేష్, పీడీ కొప్పుల శంకర్, ఆర్టీఏ జిల్లా డైరెక్టర్ రావుల మురళి, బీఆర్‌ఎస్ పార్టీ నేత నీలం దుర్గేష్, పీసీసీ సభ్యుడు గుగులోతు దస్రూనాయక్, కొల్లూ రు శ్రీనివాస్, ప్రభుకిరణ్, ఏలేందర్, సంతోష్‌రెడ్డి, సదానందం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


