
ఏడు కిలోమీటర్ల దూరంగా...
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం సర్వసతీనది పుష్కరాల నేపథ్యంలో శనివారం పదో రోజు భక్తుల వాహనాల సంఖ్య అధికంగా పెరిగింది. మహారాష్ట్ర వైపు నుంచి గోదావరిఖని, మంచిర్యాల భక్తుల సంఖ్య పెరగడంతో హనుమకొండ, కరీంనగర్, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రైవేట్ వాహనాలను అన్నారం క్రాస్ నుంచి కాళేశ్వరానికి వన్ వేలో తరలించారు. ఉదయం 11 గంటల నుంచే సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో మద్దులపల్లి–పుసుకుపల్లి గ్రామాల మధ్య రెండు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు. వాహనాల సంఖ్య పెరగడంతో నేరుగా ఎస్పీ కిరణ్‌ఖరే బైక్‌పై తిరుగుతూ కాళేశ్వరం నుంచి పుసుకుపల్లి, మద్దులపల్లి, అన్నారం మీదా అన్నారం క్రాస్ వరకు ట్రాఫిక్ రాకపోకలు, నియంత్రణను పరిశీలిస్తూ సిబ్బంది సూచనలు చేశారు. 7కిలో మీటర్ల దూరంగా అడవిలో హోల్డింగ్ పాయింట్ ఏర్పాటు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడి నుంచి త్రివేణి సంగమానికి నడుకుంటూ వెళ్లారు. భక్తులను ఇబ్బందులకు చూడలేక పోలీసులు అటువైపు నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులు, వ్యాన్‌లను ఆపి ఎక్కించి పుష్కర ఘాట్‌కు తరలించారు.
ఆటోచార్జీ ఒక్కరికి రూ.100, భక్తుల మండిపాటు..
అడవిలో పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడంతో భక్తులు అంత దూరం నడవలేక ఆటోల్లో ప్రయాణించారు. ఆటో యజమానులు ఒక్కొక్కరి నుంచి చార్జీ రూ.100 వరకు వసూళ్లు చేశారు. దీంతో భక్తులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు.
రోజు వర్షంతో ఇబ్బందులు..
ప్రతీ రోజు కాళేశ్వరంలో వర్షం కురుస్తుండడంతో సరస్వతి ఘాట్ నుంచి ముక్తీశ్వర ఆలయం వరకు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు పూర్తిగా బురదమయం కావడంతో వాహనాలు పార్క్ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులకు ట్రాఫిక్ నియంత్రణ సవాల్‌గా మారింది. పుష్కర ఘాట్ సమీపంలో పార్కింగ్ స్థలాలు వినియోగంలో లేకపోవడంతో అడవిలో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయకతప్ప లేదు.
తిరుగు ప్రయాణానికి భక్తుల అవస్థలు..
బస్సుల కోసం పడిగాపులు..
కాళేశ్వరం సరస్వతీనది పుష్కరాలకు పదో రోజు హాజరైన భక్తులు తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సుల లేక ఇబ్బందులు పడ్డారు. శనివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. కాళేశ్వరానికి ఉదయం 6గంటల నుంచే రద్దీ పెరిగింది. తిరుగు ప్రయాణానికి కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌కు మధ్యాహ్నం 2గంటల నుంచే అధిక సంఖ్యలో చేరుకున్నారు. హనుమకొండ, భూపాలపల్లి, మంథని, గోదావరిఖని, మంచిర్యాల బస్సుల కోసం ఎదురుచుశారు. అదనపు టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎండలోనే కూర్చుకున్నారు. బస్సులు కూడా తిరగలేని పరిస్థితి ఎదురైంది. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందుకు తగిన ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పలుమార్లు అధికారులను ఆదేశించారు. అయినా ఆర్టీసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనట్లు కనిపిస్తోంది.
కాళేశ్వరం పుష్కరాల పార్కింగ్ పాయింట్ ఏర్పాటు
అక్కడి నుంచి వచ్చేందుకు
భక్తుల అవస్థలు
వాహనాలను దారి మళ్లించినా నియంత్రణ కాని ట్రాఫిక్
నేరుగా రంగంలోకి దిగిన ఎస్పీ..

ఏడు కిలోమీటర్ల దూరంగా...

ఏడు కిలోమీటర్ల దూరంగా...

ఏడు కిలోమీటర్ల దూరంగా...