సమ్మర్ స్పెషల్ రైళ్ల పొడిగింపు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు వేసవి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పొడిగించినట్లు శుక్రవారం స్థానిక రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి–పాట్నా మధ్య రాకపోకలు సాగించే రైళ్లను పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
పొడిగించిన రైళ్ల వివరాలు..
జూన్ 4వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు చర్లపల్లి–పాట్నా (07255) వెళ్లే ప్రత్యేక రైలు ప్రతి గురువారం కాజీపేట జంక్షన్‌కు 1:25గంటలకు చేరుకొని వెళ్తుంది. అలాగే చర్లపల్లి–పాట్నా (07256) వెళ్లే ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం కాజీపేట జంక్షన్‌కు 23:00 గంటలకు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా జూన్ 2వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు పాట్నా–చర్లపల్లి (03253) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మంగళ, గురువారాల్లో కాజీపేట జంక్షన్‌కు 23:10 గంటలకు చేరుకొని వెళ్తుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.
సమ్మర్ స్పెషల్ రైళ్ల పొడిగింపు


