ఏటీఎంలలో చోరీ.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఏటీఎంలలో చోరీ.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌

Dec 29 2025 8:49 AM | Updated on Dec 29 2025 8:49 AM

ఏటీఎం

ఏటీఎంలలో చోరీ.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌

వరంగల్‌ క్రైం: ఏటీఎంలలో డబ్బులు బయటకు రాకుండా ఇనుప రేకు అడ్డం పెట్టి చోరీలకు పాల్ప డుతున్న రాజస్తాన్‌కు చెందిన ఏడుగురు సభ్యులు అంతర్‌ ర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత తెలిపారు. వీరి నుంచి రూ.5.10 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, నేరానికి వినియోగించే ఐరన్‌ ప్లేట్లు, డూప్లికేట్‌ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు ఆదివారం కమిషనరేట్‌ కార్యాలయంలో నిందితుల అరెస్టు వివరాలను ఆమె వెల్లడించారు. రాజస్తాన్‌లోని అల్వార్‌ జిల్లా మాల్కిడా తాలుకాలోని ఖారెడా గ్రామానికి చెందిన ఆరిఫ్‌ఖాన్‌, బీజ్వాడ నారోక గ్రామానికి చెందిన సర్ఫరాజ్‌, మోరేడా గ్రామానికి చెందిన ఎం.ఆష్‌మహ్మద్‌, షాపుస్‌ఖాన, షారూఖాన, అస్లాంఖాన, మహావకార్డ్‌ గ్రామానికి చెందిన షారుక్‌ఖాన్‌ నిందితులు. వీరు జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారని తెలిపారు. ఇందుకోసం ఓ పరిచయస్తుడి ద్వారా ఎస్‌బీఐ ఏటీఎంలలో ఏర్పాటు చేసే మిషన్లకు సంబంధించి.. పెర్టో కంపెనీకి చెందిన ఏటీఎం మిషన్లలోని లోపాలను ఈ ముఠా సభ్యులు అధ్యయనం చేశారు. ఏటీఎంలు్‌ తెరిచేందుకు వీలుగా నకిలీ తాళం చెవులను తయారు చేసుకున్నారని తెలిపారు. గత నవంబర్‌ నుంచి ఇప్పటి వరకు 7 ఏటీఎంలలో వీరు చోరీలకు పాల్పడి రూ.12.10 లక్షలను చోరీ చేసినట్లు తెలిపారు. ఇందులో సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు, కాజీపేట, హనుమకొండ, మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. నగదు పోయిందని ఖాతాదారులు సంబంధిత బ్యాంకుల్లో ఫిర్యాదు చేశారు. బ్యాంకు వారు థర్డ్‌ పార్టీ అయిన ఏటీఎం సెక్యూరిటీ, మెయింటెనెన్స్‌ చేసే సంస్థ అయిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ (ఫైనాన్సియల్‌ సాఫ్ట్‌వేర్‌ సెక్యూరిటీస్‌) లిమిటెడ్‌కు సమాచారం ఇచ్చారు. వారు ఈ చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైం అదనపు డీసీపీ బాలస్వామి, క్రైం, కాజీపేట ఏసీపీలు సదయ్య, ప్రశాంత్‌రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు ఆదివారం ఉదయం కాజీపేట చౌరస్తాలోని పెర్టో కంపెనీకి చెందిన ఏటీఎంలలో తిరిగి చోరీ చేసేందుకు కార్లలో వచ్చారు. ఏటీఎం తలుపు తెరిచి దానికి స్టిక్కర్‌ అతికించిన ఐరన్‌ ప్లేట్‌ బిగిస్తుండగా.. పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను విచారించగా చేసిన చోరీలను అంగీకరించారు. నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన పోలీసు ఉన్నతాధికారులతోపాటు సీసీఎస్‌ ఇన్‌న్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌, కాజీపేట్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ రెడ్డి, ఏఏఓ సల్మాన్‌పాషా, కాజీపేట ఎస్సైలు నవీన్‌కుమార్‌, లవణ్‌ కుమార్‌, సీసీఎస్‌ ఎస్సై శ్రీనివాస్‌ రాజు, హెడ్‌ కానిస్టేబుళ్లు మహేశ్వర్‌, శ్రీనివాస్‌, కానిస్టేబుళ్లు విష్ణు, కుమారస్వామి, శ్రీధర్‌, హన్మంతు, వినోద్‌ను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అభినందించి రివార్డులు అందజేశారు.

నగదు, రెండుకార్లు, ఐరన్‌ ప్లేట్లు, డూప్లికేట్‌ తాళాలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన వరంగల్‌

సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత

ఏటీఎంలలో చోరీ.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌1
1/1

ఏటీఎంలలో చోరీ.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement