సాఫ్ట్‌బాల్ పోటీల్లో వరంగల్ జట్టుకు మూడో స్థానం
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో మహబూబ్‌నగర్ విజేతగా నిలిచింది. ఫైనల్ లో 3–2 స్కోర్ తేడాతో మహబూబ్‌నగర్ గెలుపొందగా నిజామాబాద్ జట్టు రెండో స్థానం దక్కించుకుంది. వరంగల్, ఆదిలాబాద్ జట్లు తలపడగా 9–8స్కోర్ తేడాతో వరంగల్ జట్టు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. గెలిచిన జట్లకు ఒలింపిక్ జిల్లా కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బాబురావు, డీఐఈఓ అంజయ్య బహుమతులు, మెడల్స్ ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేశారు.
సౌత్‌జోన్ పోటీలకు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో ఈనెల 29 నుంచి జనవరి 2 వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో కాకతీయ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ ఉమెన్ జట్టు పాల్గొంటుందని స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. జట్టులో డి.హర్షిత, జి.శ్రీవాణి, పి. సృజన, ఎం.సంజన, ఇ.అనన్య తేజ, సి.హెచ్ తులసి, బి.రాధిక, బి.అఖిల, బి.వాణి, డి.పూజిత, కె.రచన, జి.అనిత ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జట్టుకు బొల్లికుంటలోని వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ సయ్యద్‌యాసిన్ కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరించనున్నారని వెంకయ్య తెలిపారు.
కేయూలో కొనసాగుతున్న క్రికెట్ పోటీలు
కేయూ క్యాంపస్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈస్ట్‌జోన్ గోల్డ్‌కప్– 2025 క్రికెట్ పోటీలు కాకతీయ యూనివర్సిటీ క్రీదామైదానంలో రెండో రోజు ఆదివారం ఉత్సాహంగా కొనసాగాయి. ఖమ్మం వర్సెస్ మహబూబాబాద్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన పోటీలో ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ చేసిన మహబూబాబాద్ జట్టు 176 పరుగులు చేసి ఆల్ అవుట్ కాగా.. ఖమ్మం జట్టు విజయం సాధించింది. తర్వాత మ్యాచ్‌లో ఖమ్మం వర్సెస్ ములుగు క్రికెట్ జట్టు పోటీపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ములుగు జట్టు 13 ఓవర్లలో 78 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఖమ్మం జట్టు 15.2 ఓవర్లలో 79 పరుగులు చేసి విజయం సాధించింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, క్రికెట్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి జయపాల్, ఉపాధ్యక్షుడు మహ్మద్‌అలీముద్దీన్, బాధ్యులు డాక్టర్ చిలువేరు రాజ్‌కుమార్, సమిఅక్మల్, దాసరి శ్రీనివాస్, విశ్వదాస్, శశాంక్, మరిగంటి నవరసన్ పాల్గొన్నారు. తెలంగాణ ఈస్ట్‌జోన్‌లోని 8 జిల్లాల జట్లు ఈపోటీల్లో పాల్గొంటున్నాయి. జనవరి 1వరకు పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
సాఫ్ట్‌బాల్ పోటీల్లో వరంగల్ జట్టుకు మూడో స్థానం


