తల్లులకు తనివితీరా మొక్కులు..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారమ్మకు భక్తులు తనివితీరా మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలొచ్చి అమ్మవార్లకు మొక్కులు అప్పగించారు. మొదటి జంపన్నవాగు స్నానఘట్టాల షవర్ల కింద స్నానాలు ఆచరించారు. జంపన్నవాగు వద్ద కల్యాణ కట్టలో భక్తులు, చిన్నారులు పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం సమ్మక్క, సారలమ్మకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగార, చీరసారె, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆరోగ్యం, సంతాన భాగ్యం కలగాలని వనదేవతలను మనసారా వేడుకున్నారు. మేడారం ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. చోరీలు జరగకుండా భక్తులను అనౌన్స్‌మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు.
అమ్మవార్ల గద్దెలకు తాళాలు..
భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు సమ్మక్క, సారలమ్మ గద్దెలకు తాళాలు వేశారు. దీంతో భక్తులు అమ్మవార్ల గద్దెలను బయట నుంచే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపైకి వెళ్లి పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మేడారం పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
200 మంది పోలీసులు బందోబసు..్త
అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత ఏర్పాట్ల కోసం 200 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్న తరుణంలో భక్తులు అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఎస్పీ ముందస్తుగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పర్యవేక్షణలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, అదనపు ఎస్పీ సదానందం, ఏఎస్పీ మనన్‌బట్, డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్సైల బందోబస్తులో పాల్గొన్నారు.
తల్లులకు మొక్కులు చెల్లిస్తున్న భక్తులు
మేడారానికి వేలాదిగా తరలొచ్చిన భక్తులు
జనసందడిగా మారిన గద్దెల ప్రాంగణం
తల్లులకు తనివితీరా మొక్కులు..
తల్లులకు తనివితీరా మొక్కులు..
తల్లులకు తనివితీరా మొక్కులు..
తల్లులకు తనివితీరా మొక్కులు..


