
ఆర్మీ జవాన్‌కు ఘన స్వాగతం
మహబూబాబాద్ రూరల్: ఆపరేషన్ సిందూర్‌లో విధులు నిర్వర్తించిన ఆర్మీ జవాన్ అజహర్‌కు మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి ఘనస్వాగతం పలికారు. టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్ అజహర్‌ను పూలమాలు, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి ఘటన అనంతరం జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో బయ్యారం మండలానికి చెందిన ఆర్మీ జవాన్ అజహర్ పాల్గొన్నారు. అక్కడ విధులు నిర్వర్తించి తన స్వగ్రామానికి చేరుకునేందుకు మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌కు ఆయన రాగా టౌన్ సీఐ దేవేందర్ ఘనస్వాగతం పలికి ఇంటికి సాగనంపారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని, బాలల సంరక్షణ అధికారి నరేష్, నాగుల్ మీరా, పాండునాయక్, సోని తదితరులు పాల్గొన్నారు.