రక్తహీనతతో అనేక సమస్యలు
మా వద్దకు వచ్చే టీనేజ్ బాలికల్లో మానసిక ఒత్తిడితో పాటు, రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారే అధికంగా ఉంటున్నారు. ఆడవారికి హిమోగ్లోబిన్ 12 నుండి 13 గ్రాముల వరకు ఉండాలి. కానీ కొందరిలో 6 గ్రాములు, 7 గ్రాములు కూడా ఉండని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఋతుస్రావం సమస్య తలెత్తుతుంది. జ్వరం, కాళ్లు, చేతులు గుంజడం, నీరసం, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఇందుకు ప్రధాన కారణం సమతుల ఆహారం తీసుకోకపోవడమే. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, బెల్లం, కర్జురా, అంజీర, పల్లీలు, నువ్వులు, పండ్లు, తాజా కూగాయలు తీసుకోవాలి. లేకపోతే రక్తహీనత వస్తుంది. టీనేజీలో మొదలైన సమస్యలు పెద్దయ్యాక మరింత జఠిలమవుతాయి. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి. – పాల్వాయి సౌజన్య, గైనకాలజిస్టు


