నేడు ముక్కోటి ఏకాదశి
మహబూబాబాద్ రూరల్: శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి పూజా వేడుకలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా భక్తులు జ రుపుకోనున్నారు. ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత ఆధారంగా జిల్లాలోని ఆలయాల్లో అర్చకులు ఉత్తర ద్వార దర్శనాల కు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవాలయం, వేణుగోపాలస్వామి దేవాలయం, వెంకటేశ్వరబజార్‌లోని స్వయంభు వేంకటేశ్వరస్వామి దేవాలయం, పాత బజార్‌లోని ఉమాచంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, అనంతాద్రి జగన్నాథ వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి పూజలు జరగనున్నాయి.
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డీటీఓ సత్యనారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో పెన్షనర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షుడు మైస నాగయ్య అధ్యక్షత వహించగా డీటీఓ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్సీ, డీఏ, ఈహెచ్‌ఎస్ ఇతరత్రా సమస్యలు పరిష్కరించాలన్నారు. 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు కూడా ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. డీటీఓ కార్యాలయం పరంగా పెన్షనర్లకు ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏటీఓ రా మకృష్ణ, ఈశ్వర్, నాగేందర్, వెంకట్‌రెడ్డి, మహేందర్, సత్యనారాయణ, ప్రసాద్, సంకా బద్రినారాయణ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
● ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు
● తెల్లవారుజామున 5 గంటల నుంచే దైవ దర్శనాలు
నేడు ముక్కోటి ఏకాదశి


