అభివృద్ధి అంతంతే..
నిర్మాణ దశలోనే కార్యాలయాలు..
సాక్షి, మహబూబాబాద్ : జిల్లాలో ఈ ఏడాది అభివృద్ధి పనులు ఆగుతూ.. సాగుతున్నాయి. ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రారంభించింది. అయితే గతంలో ప్రారంభించిన పనుల పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఏడాదిలో పూర్తవుతాయని భావించిన ప్రభుత్వ కార్యాలయా ల భవనాల నిర్మాణాల్లో పురోగతి లేదు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడత 10,651 ఇళ్లు మంజూరు చేయగా.. ఇందులో 9,858 ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేశారు. నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..
కొత్త ఉద్యోగుల రాక..
గతంలో నిర్వహించిన గ్రూప్స్ నియామకాల ప్రక్రియ ఈ ఏడాది పూర్తి చేశారు. దీంతో జిల్లాకు 160 మంది గ్రూప్–4 ఉద్యోగులతో పాటు, గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాల్లో ఎంపికై న ఉద్యోగులు కొలువుదీరారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత కొంత మేరకు తీరింది.
శిలాఫలకాలకే పరిమితం..
కేసముద్రం ప్రాంతానికి మహర్దశ పట్టింది. మండల కేంద్రంగా ఉన్న కేసముద్రం మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ప్రభుత్వ పాలిటెక్నినిక్ కళాశాల మంజూరు, రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మహబూబాబాద్ పట్టణంలో జూలై 8వ తేదీన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో పాటు, ఆరుగురు మంత్రులు రూ.400కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ ఏడాది కొత్తరేషన్ కార్డులు,
పేదలకు సన్నబియ్యం
మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
మెడికల్ కళాశాల హాస్టల్ భవనం ప్రారంభం
పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు
మొదటి స్థానం
రైల్వే మెగా మెయింటనెన్స్
డిపో నిర్మాణానికి అడుగులు!
నూతనంగా ఏర్పడిన జిల్లాలో అనేక మార్పులు వచ్చాయి. ఈమేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణం సాగుతోంది. అయితే ఇందులో బాలికలు, బాలుర హాస్టల్ భవనాలను మాత్రం రాష్ట్రవైద్యారోగ్యశాఖ మంత్రి ప్రారంభించారు. ఇక మున్సిపల్, పోలీస్ కార్యాలయాల భవనాల నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పూర్తి అయినా.. వినియోగంలోకి రాలేదు.
కేసముద్రానికి మహర్దశ
అభివృద్ధి అంతంతే..
అభివృద్ధి అంతంతే..
అభివృద్ధి అంతంతే..
అభివృద్ధి అంతంతే..
అభివృద్ధి అంతంతే..


