గ్రామాలకు నిధులు కేటాయించాలి
డోర్నకల్: గ్రామ పంచాయతీలుగా మారిన గిరిజన తండాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి అభివృద్ధికి నిధులు కేటాయించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 600 గిరిజన తండాలు, ఆవాసాలు ఉన్న డోర్నకల్ నియోజకవర్గంలో గిరిజనులు కష్టపడి సంపాదించిందంతా విద్య, వైద్యానికే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. తండా గ్రామపంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి అదనపు ఆదాయం కల్పించాలని కోరారు. డోర్నకల్‌లో 50 పడకల, కురవిలో 30 పడకల ఆస్పత్రులు నెలకొల్పాలని, మున్సిపాలిటీల్లో ప్రమాదకరంగా మారిన కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా కోతులతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు.
రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు
మహాబూబాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి నాగేశ్వర్‌రావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి సోమవారం యూరియా పంపిణీ, యాప్‌పై కలెక్టర్లు, అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐదు జిల్లాల్లో ఫర్టిలైజర్ యాప్ విజయవంతమైందన్నారు. యూరియా సరఫరాలో రైతులకు ఎలా ంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధి కారులను ఆదేశించారు. పంపిణీని కలెక్టర్లు ప ర్య వేక్షించాలన్నారు. ఎలాంటి సమస్యలు తలె త్తినా వెంటనే పరిష్కరించాలన్నారు. పర్యవేక్షణ లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వీసీ లో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, డీఏఓ విజయ నిర్మల ఉన్నారు.
దివ్యాంగులకు వివాహ నగదు ప్రోత్సాహకం
మహబూబాబాద్: దివ్యాంగుల వివాహానికి ప్రభుత్వం రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందజేస్తోందని డీడబ్ల్యూఓ సబిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అర్హులైన దివ్యాంగులు వివాహం జరిగిన సంవత్సరంలోపే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాన్నారు. ఈ పథకాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉద్యాన పంటల సాగు లాభదాయకం
మహబూబాబాద్ రూరల్: ఆయిల్ పామ్, ఉద్యాన పంటల సాగు లాభదాయకమని, పంట మార్పిడితో అధిక ఆదాయం వస్తుందని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమశాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పలు గ్రామాలను శాస్త్రవేత్తలు, అధికారుల బృందం సందర్శించి సోమవారం రైతులకు మిరప, కూరగాయలు, పండ్ల తోటల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలు, ఆయిల్ పామ్‌లో అంతర పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూడిద బూజు తెగులు, ఎండు తెగులు, తెల్లదోమ, పేను బంక, తదితర రసం పీల్చే వాటి నుంచి ఉద్యాన పంటలను సకాలంలో సంరక్షించుకోవాలని తెలిపారు. శాస్త్రవేత్తలు సురేష్, సాయికృష్ణనిఖిల్, ప్రశాంత్ ఉన్నారు.


