ప్రజలకు చేరువలో పోలీసులు
● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్: జిల్లా ప్రజలకు పోలీసులు మరింత చేరువలో ఉంటూ సేవలు అందిస్తారని, నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక నివేదిక వివరాలను ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది నేరాల కేసులు పెరిగాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, డ్రంకెన్ డ్రైవ్ కేసులు కూడా పెరిగాయన్నారు. గతంలోకన్నా 2025లో రౌడీషీట్లు కూడా ఎక్కువ ఓపెన్ చేశామని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. 2026లో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తగ్గించాలని నిర్ణయించుకున్నామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. అన్యాయానికి గురైన వారు నిర్భయంగా పోలీసు స్టేషన్లకు వచ్చి కేసులు పెట్టాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాలపై జాగ్రత్త ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, మోహన్, విజయ్ ప్రతాప్, ఎస్బీ సీఐ నరేందర్, డీసీఆర్బీ సీఐ ఉపేందర్ రావు, సీసీఎస్ సీఐ హతీరాం, పీసీఆర్ సీఐ శంకర్, సీఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య, చంద్రమౌళి, గణేష్, సత్యనారాయణ, రవికుమార్, సూర్యప్రకాష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు
జిల్లాలో నిషేధిత చైనా మాంజా విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సోమవారం మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాల ఎగరవేతకు చైనా మాంజా వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మా ంజాను ఎవరైనా విక్రయించినా లేదా వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


