
హరిత హోటల్ వద్ద భారీ భద్రత
వరంగల్ క్రైం : ప్రపంచ సుందరీమణుల వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండలో వారు బస చేసే హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఎక్కడా, ఎలాంటి సమస్య తలెత్తకుండా హరిత హోటల్‌ను పూర్తి నిఘా నీడలో ఉంచనున్నట్లు తెలిపారు.
అండర్–25 క్రికెట్ జిల్లా జట్ల ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 15, 16వ తేదీల్లో అండర్–25 జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరుణాపురంలోని వంగపల్లి క్రికెట్ మైదానంలో వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాల స్థాయి ఎంపికలు ఉంటాయన్నారు. ఆరు జిల్లాల క్రికెట్ జట్ల ఎంపిక కోసం నిర్వహించే ఈ పోటీల్లో 17 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల క్రీడాకారులు, ఆగస్టు 31, 2000 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్, మీసేవ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, యూనిఫాంతో వంగపల్లి గ్రౌండ్ వద్ద ఉదయం 10గంటల కల్లా హాజరు కావాలన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ఆరు జిల్లాల జట్లు ఎంపిక చేసి ఈనెల 19వ తేదీన అంతర్‌జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ డిస్ట్రిక్ట్‌స్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులతో కూడిన ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు జూన్ మొదటి వారం నుంచి హైదరాబాద్ కేంద్రంగా జరిగే లీగ్ పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. వివరాలకు 98495 70979 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
వడదెబ్బతో
జీపీ కార్మికుడి మృతి
హసన్‌పర్తి: వడదెబ్బతో ఓ గ్రామ పంచాయతీ కార్మికుడు మృతిచెందాడు. ఈఘటన హసన్‌పర్తి మండలం సీతానాగారంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజేందర్ గ్రామ పంచాయతీలో పంప్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విధులకు హాజరైన రాజేందర్ వడదెబ్బతో అస్వస్థకు గురై అదే రోజు రాత్రి మృతి చెందాడు. కాగా, రాజేందర్ మృతదేహాన్ని కారోబార్, బిల్‌కలెక్టర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానందం, కార్యదర్శి వెంకన్న, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రజనీకుమార్ సందర్శించి నివాళులర్పించారు.
కోటలో ఏర్పాట్ల పరిశీలన..
ఖిలా వరంగల్: ప్రపంచ సుందరీమణుల రాకకు కోటలోని శిల్పాల ప్రాంగణాన్ని మంగళవారం రాత్రి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, పర్యాటక శాఖ రాష్ట్ర అధికారి నాథన్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సందర్శించి ఏర్పాట్లును పరిశీలించారు. రాత్రి వేళల్లో కోట మరింత సౌందర్యవంతంగా కనిపించేలా తీర్చిదిద్దిన లైటింగ్ ఏర్పాట్లను ఆసక్తిగా తిలకించారు. తె లంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రత్యేక స్వాగతం పలకనున్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఏసీపీ నందిరామ్ నాయక్, తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

హరిత హోటల్ వద్ద భారీ భద్రత