
రక్తపోటుపై అవగాహన కల్పించాలి
నెహ్రూసెంటర్: పీహెచ్‌సీలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామాల్లో రక్తపోటు(బీపీ)పై ప్రజ లకు అవగాహన కల్పిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ తెలిపారు. ప్రపంచ రక్తపోటు(బీపీ) నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎప్పటికప్పుడు రక్తపోటును పరీక్షించుకుంటూ మందులు వాడడం ద్వారా ని యంత్రణలో ఉంచుకోవచ్చని తెలిపారు. రక్తపోటు తనిఖీలు, ప్రాముఖ్యత, చికిత్స నివారణపై క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు వివరించాలన్నా రు. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, యోగా వంటివాటితో రక్తపోటను అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు నాగేశ్వర్‌రావు, సుధీర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, సారంగం, విజయ్‌కుమార్, మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఆశా నోడల్ ఆఫీసర్ సక్కుభాయి, హెచ్‌ఈఓ వెంకటేశ్వర్‌రాజు, శారద, గీత, పురుషోత్తం, రామకృష్ణ, కేఎల్‌ఎన్ స్వామి, లోక్య, డీపీఓ నీలోహన, నీలిమాశ్వేత, అశోక్, అరుణ్, మనోహర్, సౌమిత, వసంత, త్రివేణి, సీహెచ్‌ఓ రవీంద్రకుమార్ పాల్గొన్నారు.
వడదెబ్బపై జాగ్రత్తలు పాటించాలి
పెద్దవంగర: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పా టిస్తే మిమ్మల్ని మీరు రక్షించు కోవచ్చని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ సూచించారు. శనివారం మండల కేంద్రంతోపాటు ఉప్పరగూడెంలో వైద్యసిబ్బంది చేపట్టిన వాక్సినేషన్ పరిశీలించారు. అంతకు ముందు మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీజీ, ఓపీవీ, పంటా వంటి వాక్సిన్‌లు క్రమం తప్పకుండా అందించాలని అదేశించారు. ఎంఎల్‌హెచ్‌పీలు మహిపాల్, మహేష్, ఏఎన్‌ఎంలు హరిత, నాగజ్యోతి, ఆశాలు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్