
డెంగీ నివారణకు కృషి చేద్దాం●
● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిన డెంగీ వ్యాఽధి నివారణకు ప్రజలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అన్నారు. జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దోమల వృద్ధికి అనుకూలమైన పరిస్థితులను మనుషులే సృష్టిస్తున్నారని, వాటి నివారణను ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దొమల నివారణ పద్ధతులు పాటించాలని తెలిపారు. ఏటా డెంగీ కేసులు పెరుగుతూ రోగులు చనిపోతున్నారని, వ్యాధికి కచ్చితమైన ఔషధం లేనందున నివారణ ఒక్కటే మార్గమన్నారు. కార్యక్రంమలో ప్రోగ్రాం అధికారులు సుధీర్‌రెడ్డి, శ్రవణ్, జీజీహెచ్ ఆర్‌ఎంఓలు జగదీశ్వర్, హర్షవర్ధన్, జిల్లా డిప్యూటీ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీహెచ్‌ఎన్‌ఓ సక్కుభాయి, హెచ్‌ఈలు కేవీ రాజు, పురుషోత్తం, సబ్ యూనిట్ ఆఫీసర్ గోపిచంద్, శ్రీరామ్, రామకృష్ణ, కేఎల్‌ఎన్ స్వామి, సత్యనారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహించొద్దు
గూడూరు: చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. మండలంలోని భూపతిపేట చెక్‌పోస్టును శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువుల అక్రమ రవాణాతో పాటు ఇతర అక్రమ వ్యాపారాలపై కూడా నిఘా పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో గూడూరు సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై గిరిధర్‌రెడ్డి, కొత్తగూడ, గంగారం ఎస్సైలు కుషకుమార్, రవికుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డెంగీ నివారణకు కృషి చేద్దాం●