
ప్రశాంతంగా పాలీసెట్
– వివరాలు 8లోu
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో పాలీసెట్–2025 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని పాలీసెట్ జిల్లా కోఆర్డినేటర్ ఎం. రాంప్రసాద్ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. 897మంది బాలురకు 844 మంది హాజరై 53 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. 761మంది బాలికలకు 710 మంది హాజరై 51 మంది గైర్హాజరయ్యారన్నారు. మొత్తంగా 1,554మంది విద్యార్థులు హాజరై 104మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్షలకు సహకరించిన పోలీస్, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

ప్రశాంతంగా పాలీసెట్

ప్రశాంతంగా పాలీసెట్