
కంటి పరీక్షలు నిర్వహించాలి
● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్ల లందరికీ ఆర్‌బీఎస్‌కే కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఆర్‌బీఎస్‌కే కార్యక్రమంపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఎనిమి యా ఉన్న పిల్లలను గుర్తించి వారికి ఐరన్, పోలిక్ ఆసిడ్ మాత్రలు ఇవ్వాలని సూచించారు. ఆర్‌బీఎస్‌కే బృందాలు గిరిజన వెల్ఫేర్, కస్తూర్బా, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, హెచ్‌ఈఓ రామకృష్ణ, డాక్టర్ కుమార్, డాక్టర్ శివరాం తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి ఎం.నర్సింహస్వామి బుధవారం తెలిపారు. ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్‌కు యత్నం
● డీఎంహెచ్‌ఓకు సమాచారం..
అప్పటికే చేజారిన పరిస్థితి
● జీజీహెచ్‌కు తరలించి అబార్షన్
నెహ్రూసెంటర్: జిల్లాలోని ఓ మండలానికి చెందిన గర్భిణి పక్క జిల్లాలో స్కానింగ్ చేసుకోగా.. ఆడపిల్ల అని తేలినట్లు సమాచారం. కాగా గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఈమేరకు ఆమె జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. విషయం తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెనె జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి చేజారి పోవడంతో బుధవారం అబార్షన్ జరిగింది. ఈ ఘటనపై డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ను వివరణ కోరగా.. తమకు సమాచారం అందిన వెంటనే వెళ్లి సదరు మహిళను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించామని.. అక్కడ అబార్షన్ జరిగిందని తెలిపారు. అబార్షన్ విషయమై భార్యభర్తలను విచారించి కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. చికిత్స అందించిన ప్రైవేట్ ఆస్పత్రికి నోటీసులు జారీ చేశామని, ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్‌ఓ వెల్లడించారు.
శాంతి భద్రతల
పరిరక్షణకు కృషి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
తొర్రూరు: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు అంకితభావంతో కృషి చేస్తున్నారని ఎస్పీ సుఽధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. డివిజన్ కేంద్రంలో ఆధునికీకరించిన స్థానిక పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని బుధవారం ఎస్పీ ప్రారంభించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న పోలీసులకు ప్రశంసపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూ అసాంఘిక శక్తులపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్‌లను ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోలీస్‌స్టేషన్‌లలో వెయిటింగ్ హాల్, ప్రత్యేక కౌంటర్లు, సీసీ కెమెరాలు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిశోర్, డీఎస్పీలు తిరుపతి, శ్రీనివాస్, మోహన్, సీఐలు టి.గణేష్, రాజు, చంద్రమోహన్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

కంటి పరీక్షలు నిర్వహించాలి

కంటి పరీక్షలు నిర్వహించాలి