
బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామానికి చెందిన కొర్ర ధర్మ (55) శుక్రవారం భవన నిర్మాణ పని నిమిత్తం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చాడు. శనివారం ఉదయం పని నిమిత్తం జగ్జీవన్ రామ్ కాలనీ ప్రాంతం మీదుగా నడిచి వెళ్తున్నాడు. అదే సమయంలో నర్సంపేట అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన బిట్స్ కళాశాల బస్సు జగ్జీవన్ రామ్ కాలనీ సమీపంలో వెనుకకు వస్తోంది. ఈ క్రమంలో ధర్మ నడిచి వచ్చే విషయాన్ని బస్సు డ్రైవర్ మల్లెపాక ఐలయ్య గుర్తించలేదు. దీంతో బస్సు ఢీకొని ధర్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అవుట్ పోస్ట్ కానిస్టేబు ల్ మధు టౌన్ పోలీసులకు సమాచారం అందజే యగా టౌన్ ఎస్సై అలీంహుస్సేన్, హెడ్ కానిస్టేబు ల్ దామోదర్ ఘటనాస్థలిలో విచారణ చేపట్టారు.