
వీఐపీల సేవలో అధికార గణం
● సామాన్య భక్తులను
పట్టించుకోని వైనం
● ఇబ్బందులు పడిన దివ్యాంగులు,
వృద్ధులు, గర్భిణులు
భూపాలపల్లి/కాళేశ్వరం: కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా రెండో రోజు శుక్రవారం భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఈ క్రమంలో సరస్వతి ఘాట్, కాళేశ్వరాలయంలో పోలీసులు, జిల్లా అధికారులు వీఐపీల సేవలకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సాధారణ భక్తుల వాహనాలను పుష్కర ఘాట్‌కు కిలోమీటర్ దూరంలో గల పార్కింగ్ ప్రదేశంలో నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఘాట్ వద్దకు వెళ్లాలి. అయితే ఇదే రహదారిపై ఒక్కో వీఐపీని రెండు, మూడు ఎస్కార్ట్ వాహనాలతో తీసుకెళ్తుండడంతో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చే యకపోవడంతో వారు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. ఇది లా ఉండగా పుష్కర ఘాట్ తీరంలో తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో భక్తుల గొంతెండింది. విషయం తెలు సుకున్న కలెక్టర్ రాహుల్ శర్మ మ ధ్యాహ్నం ట్రాలీల ద్వారా మినరల్ వాటర్ సరఫరా చేయించారు. ఆలయంలో గంటల తరబడి సామాన్య భక్తులు క్యూ లెన్లలో ని రీక్షించాల్సి వచ్చినా అధికారులు చూడలేదు. స్థానిక పోలీసు, దేవాదాయశాఖ అధికారులు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వర్తిస్తున్న వారు... పోలీసులు, ప్రభు త్వ అధికారుల కుటుంబీకులను ప్రత్యేకంగా ఆలయం లోపలికి పంపించడంపై సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఉత్సవ కమిటీ ఉన్నా ఏ అధికారం లేకపోవడంతో వారు ఉత్సవ విగ్రహాలుగా మారారని పలువురు పేర్కొన్నారు.