
రైల్వే లోకోపైలెట్ల గైర్హాజరుతో పది రైళ్లు రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ కేంద్రంగా ప్రయాణిస్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, పుష్‌పుల్ ప్యాసింజర్ రైళ్లను లోకోపైలెట్ల గైర్హాజరుతో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. లోకో పైలెట్లు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు రాస్తున్నందున ప్యాసింజర్ రైళ్లను నడిపించే వారి కొరత ఏర్పడిందని, దాంతో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను సికింద్రాబాద్ అధికారులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, పలు రైళ్ల రద్దుతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పుష్ పుల్ ప్యాసింజర్ రైళ్లు రద్దు కావడంతో ఎక్స్‌ప్రెస్ రై ళ్లలో వెళ్లలేక సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు.
రద్దయిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు కాజీపేట – బల్లార్షా (17035) వెళ్లే ఎక్స్‌ప్రెస్, ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు బల్లార్షా – కాజీపేట (17036) వెళ్లే ఎక్స్‌ప్రెస్, కాజీపేట – సిర్పూర్ కాగజ్‌నగర్ (17003) వెళ్లే ఎక్స్‌ప్రెస్, బల్లార్షా – కాజీపేట (17004) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లు.
నిలిచిన పుష్‌పుల్ ట్రైన్స్
ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు సికింద్రాబాద్ – వరంగల్ (67761) వెళ్లే పుష్‌పుల్, వరంగల్ – సికింద్రాబాద్ (67762) పుష్‌పుల్, సికింద్రాబాద్ – కా జీపేట (67763) పుష్‌పుల్, కాజీపేట – సికింద్రాబాద్ (67764) పుష్‌పుల్, డోర్నకల్ – కాజీపేట (67766) పుష్‌పుల్, కాజీపేట డోర్నకల్ (67765) పుష్‌పుల్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వివరించారు.
క్రైం ఏసీపీగా కిరణ్‌కుమార్
బాధ్యతల స్వీకరణ
రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ క్రైం విభాగం నూతన ఏసీపీగా కిరణ్‌కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌ను అధికారులు, సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.

రైల్వే లోకోపైలెట్ల గైర్హాజరుతో పది రైళ్లు రద్దు