
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన కలెక్టర్ రాహుల్, ఎస్పీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మూడో రోజు కాళేశ్వరానికి భక్తుల రద్దీ పెరిగింది. శనివారం వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో కాళేశ్వరం బయలుదేరగా మహదేవపూర్ – కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈక్రమంలో వాహనాలను క్రమబద్ధీకరించేందుకు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ బైక్‌పై తిరుగుతూ వాహనాలను పంపించి రూట్ క్లియర్ చేశారు. కాగా, శని, ఆది వారాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేసి యంత్రాంగాన్ని వారు అప్రమత్తం చేశారు.