
నేటి నుంచి జాయ్‌రైడ్స్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జాయ్‌రైడ్స్‌కు ఆదివారం నుంచి హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది. కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద భక్తులు విహంగ వీక్షణం చేయడానికి ఏవియేషన్ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. యాత్రధామ్.ఓఆర్‌జీ యాప్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని, జాయ్‌రైడ్స్, టెంట్‌సిటీ, దేవస్థానం పూజలను ఈ యాప్‌లో పొందుపర్చినట్లు వివరించారు. జాయ్‌రైడ్స్ బుకింగ్ కోసం ఒక్కరికి రూ.4,500తో 6 – 7 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టనున్నారు. కన్నెపల్లి హెలిపాడ్ వద్ద హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. టెంట్‌సిటీకి ఒక రోజుకు రూ.3వేల వరకు తీసుకుంటున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు.
ఎడ్ల బండ్లకు పెరిగిన గిరాకీ
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద ఎడ్ల బండ్లకు గిరాకీ పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ బురదమయంగా మారాయి. దాంతో బురద రోడ్లపై వాహనాలు ముందుకు సాగక భక్తులు ఇబ్బందులు పడ్డారు. కార్లు, వాహనాలను దూరంగా పార్కింగ్ చేసి కాలినడకన వెళ్లలేక ఎడ్ల బండ్లను ఆశ్రయించారు. ఎడ్లబండ్ల యజమానులు ఒక్కరికి రూ.50 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు.

నేటి నుంచి జాయ్‌రైడ్స్