జీజీహెచ్‌లో శిశువు మృతి
నెహ్రూసెంటర్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆదివారం నవజాత శిశువు మృతి చెందింది. కుటుంబీకుల కథనం ప్రకారం.. కురవి మండలం మొగిలిచర్ల శివారు జగ్యాతండాకు చెందిన నూనావత్ భువనేశ్వరికి పురిటినొప్పులు రాగా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు.. భువనేశ్వరికి స్కానింగ్ చేసి శిశువు కడుపులోనే మృతి చెందినట్లు చెప్పారు. నార్మల్ డెలివరీ చేసి శిశువును బయటకు తీసిన అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. కాగా, మూడు రోజుల క్రితం ఆస్పత్రికి వస్తే బాగానే ఉన్నారని వైద్యులు చెప్పారని, ఇప్పుడు శిశువు ఎందుకు మృతి చెందాడని వైద్యులను నిలదీశారు. ఈ ఘటనపై ఆస్పత్రి ఆర్‌ఎంఓ జగదీశ్వర్‌ను వివరణ కోరగా జన్యుపరమైన కారణాలతో శిశువు కడుపులోనే మృతి చెందాడని, వైద్యుల నిర్లక్ష్యమేమి లేదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


