సీనియర్‌ వాలీబాల్‌ తెలంగాణ జట్టు హెడ్‌ కోచ్‌గా కృష్ణప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ వాలీబాల్‌ తెలంగాణ జట్టు హెడ్‌ కోచ్‌గా కృష్ణప్రసాద్‌

Jan 2 2026 11:31 AM | Updated on Jan 2 2026 11:31 AM

సీనియ

సీనియర్‌ వాలీబాల్‌ తెలంగాణ జట్టు హెడ్‌ కోచ్‌గా కృష్ణప్ర

గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన కోసరి కృష్ణప్రసాద్‌ మరోసారి జాతీయ వేదికపై తెలంగాణ జట్టుకు హెడ్‌ కోచ్‌గా మెరవనున్నారు. జనవరి 4 నుంచి 11వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరగనున్న సీనియర్‌ జాతీయ వాలీబాల్‌ తెలంగాణ జట్టుకు ఆయన హెడ్‌ కోచ్‌గా నేతృత్వం వహించనున్నారు. వాలీబాల్‌ క్రీడను గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లాలనే సంకల్పంతో పదేళ్లుగా తెలంగాణ వాలీబాల్‌ జట్టుకు సేవలందిస్తున్నారు. దీంతో రాబోయే జాతీయ పోటీల్లో తెలంగాణ జట్టు విజయం సాధించాలని గ్రామస్తులు, క్రీడాభిమానులు ఆకాంక్షించారు. అలాగే, కృష్ణప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, కృష్ణప్రసాద్‌ శిక్షణలో 80 మంది యువకులు, 45 మంది యువతులు పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు.

ఎస్టీ హాస్టల్‌లో

విద్యార్థిపై దాడి

అర్ధరాత్రి వచ్చి కొట్టిన బయటి వ్యక్తి

కొడకండ్ల మండల కేంద్రంలో ఘటన

వార్డెన్‌ పర్యవేక్షణాలోపంపై

తల్లిదండ్రుల ఆగ్రహం

కొడకండ్ల: జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర హాస్టల్‌లో ఓ విద్యార్థిని హాస్టల్‌కు సంబంధం లేని ఓ యువకుడు లోపలికి వచ్చి చితకబాదాడు. ఈమేరకు బాధిత విద్యార్థి గురువారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బోడోనికుంట తండాకు చెందిన ధరావత్‌ ప్రభాకర్‌ అనే విద్యార్థి మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతూ ఎస్టీ హాస్టల్‌లో ఉంటున్నాడు. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రించేందుకు మంచాల వద్దకు వెళ్లాడు. 9వ తరగతి విద్యార్థులు బయటికి వెళ్లగా ఎందుకు వెళ్లారని, నిద్రించాలని ప్రభాకర్‌ వారికి సూచించి అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పాకాల గ్రామానికి చెందిన నవీన్‌ అనే యువకుడు మద్యం మత్తులో హాస్టల్‌ గదికి వచ్చి ప్రభాకర్‌ను కొట్టి బూతులు తిట్టి చంపేస్తానని బెదిరించాడు. ఈమేరకు ప్రభాకర్‌ ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.

వార్డెన్‌ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం..

ఎస్టీ హాస్టల్‌ వార్డెన్‌ మల్లునాయక్‌ విద్యార్థుల యోగక్షేమాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సొంత మండలంలో విధులు నిర్వర్తిస్తూ చుట్టపుచూపులా వచ్చిపోతుంటాడని, వార్డెన్‌ నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు కోసం పిల్లలను హాస్టల్‌లో ఉంచితే వారికి భద్రత కరువైందని, బయటి నుంచి వచ్చి విద్యార్థిని కొడితే కూడా పట్టించుకొనేవారే కరువయ్యారని ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ముగిసిన క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లు

కేయూ క్యాంపస్‌: తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ఈస్ట్‌జోన్‌ గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీల లీగ్‌మ్యాచ్‌లు ముగిశాయి. గురువారం వరంగల్‌, సూర్యాపేట జట్లు తలపడగా వరంగల్‌ సాధించింది. ఈ క్రికెట్‌ పోటీలకు ముఖ్యఅతిథిగా హనుమకొండ రోహిణి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సుధాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ రామ్‌రెడ్డి పాల్గొని ప్రారంభించారు. కాగా, నేడు సెమీఫైనల్‌ మ్యాచ్‌లలో హనుమకొండ, కొత్తగూడె– భద్రాద్రి, పెద్దపల్లి –ఖమ్మం జట్లు తలపడనున్నాయి. ఆరెండు జట్లలో గెలిచిన జట్లు ఈనెల 3న ఫైనల్‌లో తలపడుతాయని నిర్వాహకులు తెలిపారు.

సీనియర్‌ వాలీబాల్‌ తెలంగాణ జట్టు హెడ్‌ కోచ్‌గా కృష్ణప్ర1
1/2

సీనియర్‌ వాలీబాల్‌ తెలంగాణ జట్టు హెడ్‌ కోచ్‌గా కృష్ణప్ర

సీనియర్‌ వాలీబాల్‌ తెలంగాణ జట్టు హెడ్‌ కోచ్‌గా కృష్ణప్ర2
2/2

సీనియర్‌ వాలీబాల్‌ తెలంగాణ జట్టు హెడ్‌ కోచ్‌గా కృష్ణప్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement