అడవికి కొత్త అందాలు..
ఎస్‌ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో ఎకో టూరిజం ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించేలా అడవికి సరికొత్త అందాలు తీర్చిదిద్దారు. తాడ్వాయి – ఏటూరునాగారం అటవీ మార్గంలో పర్యాటకులకు స్వాగతం పలుకుతూ ఆర్చ్‌తోపాటు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి కర్రలతో అలంకరించారు. అదే విధంగా తాడ్వాయి – పస్రా మార్గంలో దుర్గం గుట్టను పర్యాటకులు సందర్శించి ఆహ్లాదం పొందేలా ఏర్పాట్లు చేశారు. తాగునీటి వసతి, గుట్టపై నుంచి అడవులను తిలకించేందుకు మంచెలు నిర్మించారు. వీటితోపాటు తాడ్వాయి హట్స్‌లో అచ్చం అడవి జంతువుల మాదిరి బొమ్మలను ఏర్పాటు చేశారు. తద్వారా మేడారం జాతర సందర్భంగా వచ్చే భక్తులు ఈ అటవీ అందాలను వీక్షించే అవకాశం కల్పించారు.
మేడారం జంక్షన్లకు నూతన కళ..
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలో పలు జంక్షన్లను బొమ్మలు, శిల్పాలతో అలంకరిస్తున్నారు. ఊర ట్టం స్తూపం వద్ద, హరిత హోటల్ క్రాస్, ఐలాండ్ ప్రదేశం, బస్టాండ్ ప్రదేశాల్లో జంక్షన్లు నిర్మిస్తున్నారు. ఇవి భక్తులకు ఆకర్షణీయంగా కనిపించేలా ప్రత్యేక శిల్పాలు, జంతువుల బొమ్మలతో పాటు ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించే బొ మ్మలు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవార్ల గద్దెల పునర్నిర్మాణంలో భాగంగా జంక్షన్లు నిర్మిస్తున్నా రు. ఆదివాసీ సంప్రదాయాలు, జీవన విధానం ప్రతిబింబించేలా బొమ్మల రూపకల్పనతోపా టు లైటింగ్, మొక్కలతో జంక్షన్లు తీర్చిదిద్దితున్నారు. కాగా,జంక్షన్ల అలంకరణతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతితోపాటు సాంస్కృతిక వైభవం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అటవీ జంతువుల బొమ్మల ఏర్పాటు
అడవికి కొత్త అందాలు..
అడవికి కొత్త అందాలు..
అడవికి కొత్త అందాలు..
అడవికి కొత్త అందాలు..


