
సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మహబూబాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అౖద్వైత్‌కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సంబంధి త అధికారులతో కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించి న సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 22 నుంచి 28వ తేదీవరకు పరీక్షలు నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ద్వితీయ సంవత్స రం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయన్నారు. జిల్లాలోని 14 పరీక్షా కేంద్రాల్లో మొదటి సంవత్స రం విద్యార్థులు 2,539 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,594 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. డీఐఈఓ మదార్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నరేష్, డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.
యువ వికాసం దరఖాస్తుల పరిశీలన
వేగంగా పూర్తి చేయాలి
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత బ్యాంకర్లకు పంపాలని, అన్ని దరఖాస్తులు బ్యాంకర్లు, ఎంపీడీఓలతో పరిశీలన చేపట్టాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిసారించి హర్డ్ కాపీలను అందచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, అధికారులు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నెల్లికుదురు: కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టిన ధాన్యం బస్తాలను తరలించే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని మధనతుర్తి, ఎర్రబెల్లిగూడెం, నెల్లికుదురు గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను శనివారం కలెక్టర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. వరిధాన్యాన్ని త్వరగా కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్పాలీన్లు అందుబాటులో ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎర్రబెల్లిగూడెం సబ్‌సెంటర్‌ను సందర్శించి వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎండతీవ్రత, వడగాల్పులపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పిచారు. మండల ప్రత్యేక అధికారి జినుగు మరియన్న, తహసీల్దార్ రాజు ఉన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్