
వివాహ వేడుకకు వెళ్లొస్తూ.. అనంతలోకాలకు
బచ్చన్నపేట : స్నేహితుడి అ న్న వివాహ వేడుకకు వెళ్లొస్తూ ఓ విద్యార్థి అనంతలోకాల కు చేరాడు. కారు అదుపు తప్పడంతో దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి కి గాయాలయ్యాయి. ఈ ఘ టన శుక్రవారం రాత్రి మండలంలోని బచ్చన్నపేట– ఆలేరు రోడ్డులోని పది మోటల బావి వద్ద జరి గింది. కుటుంబీకులు, ఎస్సై అబ్దుల్ హమీద్ కథ నం ప్రకారం.. మండలంలోని పోచన్నపేటకు చెందిన పేరిణి ఉమ, దేవేందర్ దంపతుల పెద్ద కుమారుడు గౌతమ్ (19) హైదరాబాద్ ఘట్‌కేసర్‌లోని సాంస్కృతి ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం గ్రామా నికి చెందిన తన స్నేహితుడి అన్న వివాహం ఉండగా స్నేహితులు దేవరాయ శ్రీకాంత్, తమ్మిడి అఖిల్‌తో కలిసి కారులో బచ్చన్నపేట (వివాహం జరిగిన ప్రాంతం) కు బయలుదేరాడు. వివాహ వేడుక అ నంతరం బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కారును అజాగ్రత్తగా నడపడంతో మండలంలోని పది మోటల బావి వద్ద అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీ కాంత్, అఖిల్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి గౌతమ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కారు అదుపు తప్పి విద్యార్థి దుర్మరణం
బచ్చన్నపేట, ఆలేరు రోడ్డులో ఘటన