
సీఎంను కలిసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సీరెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని నివాసంలో సీఎంను కలిసిన వినతిపత్రం అందజేశారు. నిధుల మంజూరుపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు.
తహసీల్దార్ల బదిలీ
మహబూబాబాద్: జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ చీఫ్ కమిషనర్ నవీన్‌మిట్టల్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ తహసీల్దార్ భగవాన్‌రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేశారు. తహసీల్దార్లు సైదులు, శ్వేత, నారాయణమూర్తిని ఖమ్మం జిల్లాకు, తహసీల్దార్ రమాదేవిని ములుగు జిల్లాకు బదిలీ చేశారు. భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు సీహెచ్.నరేశ్, వివేక్, ఇమ్మానీయల్, నాగభవాని, పూర్ణచందర్, రమేశ్‌బాబును మహబూబా బాద్‌కు జిల్లాకు బదిలీ చేశారు. కాగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ బదిలీపై వచ్చిన తహసీల్దార్లకు మండలాలు కేటాయించనున్నారు.
నేరప్రవృత్తిని విడనాడాలి
తొర్రూరు: రౌడీ షీటర్లు నేరప్రవృత్తిని విడనాడాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్ అ న్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ యన మాట్లాడుతూ.. రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే రౌడీషీట్ తొలగిస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. సీఐ గణేశ్, ఎస్సైలు ఉపేందర్, రమేష్‌బాబు, రాజు, సురేశ్ పాల్గొన్నారు.