
9 రోజుల బాబుకు ఊపిరి పోశారు..
కమలాపూర్: వైద్యో నారాయణ హరి.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. అలాంటి ఘటనే ఇది. ఊపిరాడక, కదలిక లేని 9 రోజుల బాబుకు వైద్యులు, సిబ్బంది ఊపిరి పోసి కాపాడారు. ఈ ఘటన మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ సా మాజిక ఆరో గ్య కేంద్రంలో చోటు చేసుకుంది. కమలాపూర్‌కు చెందిన రాపెల్లి సంధ్యారాణి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో 9 రోజుల క్రితం ప్రసవించి బాబుకు జన్మనిచ్చింది. అవగాహనారాహిత్యంతో బాబుకు సబ్బుతో స్నా నం చేయించడంతో ముక్కులోకి సబ్బు నీళ్లు వెళ్లి ఊపిరాడక, కదలిక లేకుండా పోయింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా డాక్టర్ వరుణ్ మా ధవ్ ఆధ్వర్యంలో నర్సింగ్ ఆఫీసర్లు స్వప్న, అనిత, కల్యాణి కలిసి బాబు ముక్కులో పైపు వేసి ఆస్పిరేషన్ ద్వారా సబ్బు నీళ్లు బయటకు తీయడంతో బా బులో కదలిక వచ్చి ఒక్కసారిగా ఏడవటం ప్రారంభించాడు. అనంతరం బాబుకు పిల్లల వైద్యుడితో మెరుగైన వైద్యం ఇప్పించాలని సూచించి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. దీంతో సదరు కుటుంబీకులు బాబుకు ఊపిరి పోసిన వైద్యుడు, నర్సింగ్ ఆఫీసర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్
ఆస్పత్రి వైద్యుల ఘనత