బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదల చేయిస్తా
గార్ల: పాకాల ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి సీపీఐ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న దీక్షశిబిరాన్ని మంగళవారం సందర్శించారు. ఈనెల 17న బ్రిడ్జి నిర్మాణం నిధుల విడుదలపై డిప్యూటీ సీఎంను కలుస్తామన్నారు. అప్పటి వరకు దీక్షను విరమింపజేయాలని నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను ముగించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, నాయకులు అజయ్‌సారథి, శ్రీనివాస్, కుమార్, వెంకన్న, లక్ష్మి, జనార్దన్, లోకేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


