
వందశాతం అడ్మిషన్లు పూర్తి చేయాలి
మహబూబాబాద్ అర్బన్: మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వందశాతం అడ్మిషన్లు పూర్తి చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్సీఓ రమేశ్ లాల్ హట్కర్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశా ల ఉపాధ్యాయులు చేపట్టిన అడ్మిషన్ల ప్రక్రియను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ గురుకులాల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ముస్లిం విద్యార్థుల అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారం చేయాలని, విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మైనార్టీ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు ఉచితంగా అందిస్తారని అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు మహేశ్, రాజశేఖర్, ఇమాముద్దీన్ పాల్గొన్నారు.