సాగు ప్రణాళిక ఖరారు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 4,22,641 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఈమేరకు అధికారులు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు. ఇదిలా ఉండగా రైతులు వేసవి దుక్కులను దున్నుతున్నారు.
అదనపు చర్యలు..
జిల్లా వ్యవసాయ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతులకు సాంకేతిక సహాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాగా జిల్లాకు 11వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను కేటాయించగా.. పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), వ్యవసాయ పరిశోధన కేంద్రాల వద్ద 50శాతం సబ్సిడీపై ఈ విత్తనాలను పొందవచ్చు.
దుక్కులు పొతం..
జిల్లాలో మెట్టప్రాంతాల్లో పత్తి, మిర్చి, మొక్కజొన్న అధికంగా పండిస్తారు. అలాగే కంది, బొబ్బెర, నువ్వులు, పెసర, మినుములు, వేరుశనగ, పసుపు పంటలు కూడా సాగు చేస్తారు. ఈమేరకు ప్రస్తుతం రైతులు వేసవి దుక్కులు దున్ని పంట వేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు.
ఎరువుల అవసరం (మెట్రిక్ టన్నుల్లో)
యూరియా : 54,198.975
డీఏపీ : 10,526.993
ఎంఓపీ : 5,119.540
ఎస్‌ఎస్పీ : 1,390.493
కాంప్లెక్స్ : 34,762.331
నేడు ఐడీఓసీలో సమావేశం
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం వానాకాలం సాగు సన్నద్ధతపై సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని రకాల విత్తన వ్యాపారులు హాజరుకావాలి. ఈ సమావేశంలో విత్తనాల సరఫరా, నాణ్యత, రైతులకు సకాలంలో అధికారుల అందుబాటు తదితర అంశాలపై చర్చిస్తారు.
– విజయనిర్మల, డీఏఓ
పంటల సాగు వివరాలు(ఎకరాల్లో)
వానాకాలంలో 4,22,641 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేలా చర్యలు
వేసవి దుక్కులు దున్నుతున్న రైతులు
కావాల్సిన విత్తనాలు
వరి : 44,256 క్వింటాళ్లు
పత్తి : 1,69,708
(ప్రతీ ప్యాకెట్ 475 గ్రాములు)
మొక్కజొన్న : 4,669 క్వింటాళ్లు
మిరప : 522.49 క్వింటాళ్లు
కంది : 30 క్వింటాళ్లు
పెసర : 182.2 క్వింటాళ్లు
మినుములు : 40 కిలోలు
వేరుశనగ : 21 క్వింటాళ్లు
పసుపు : 2,315 క్వింటాళ్లు
నువ్వులు : 1.04 క్వింటాళ్లు


