వైద్య సేవలు విస్తృతం..
భూపాలపల్లి అర్బన్: సరస్వతీనది పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన పది వైద్య శిబిరాల్లో భక్తులకు విస్తృత వైద్య సేవలు అందిస్తున్నారు. స్థానిక పీహెచ్‌సీలో పది పడకలతో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేశారు. శుక్రవారం 200 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించగా 12 మందిని అడ్మిట్ చేసుకున్నారు. భూపాలపల్లికి చెందిన నందకిశోర్ కాళేశ్వరంలో తేలు కాటుకు గురికాగా 108లో పీహెచ్‌సీకి చేరుకోగా చికిత్స అందించారు. ఇద్దరికి ఫిట్స్ రావడంలో ప్రాథమిక చికిత్స అందించి భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పలువురు భక్తులు, పారిశుద్ధ్య కార్మికులు వడదెబ్బకు గురైనట్లు డీఎంహెచ్‌ఓ మధుసూదన్ తెలిపారు.


