
28 మందిపై రౌడీషీట్ ఎత్తివేత
● ప్రకటించిన డీఎస్పీ తిరుపతిరావు
మహబూబాబాద్ రూరల్: రౌడీషీటర్లు సత్ప్రవర్తన కలిగిఉంటే వారిపైఉన్న రౌడీషీట్ తొలగిస్తామని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ సబ్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన 28 మందిపై రౌడీషీట్ తొలగించారు. సబ్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగినవారిపై రౌడీషీట్ తొలగింపు మేళా శనివారం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సాధారణ జీవి తం గడుపుతున్న వారిపై రౌడీ షీట్లను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. రౌడీషీట్ తొలిగించినవారు భవి ష్యత్‌లో ఎలాంటి నేరాలకు పాల్పడొద్దని తెలిపా రు. అలాగే ఎక్కడైనా ఏదైనా నేరం జరిగితే పోలీసులకు సమాచారమందించే బాధ్యతాయుత పౌరులుగా పోలీసులకు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు చె ప్పారు. కార్యక్రమంలో టౌన్, డోర్నకల్, బయ్యా రం సీఐలు దేవేందర్, రాజేష్, రవి, ఎస్సైలు సతీష్, తిరుపతి, దీపిక, మురళీధర్ రాజు పాల్గొన్నారు.