
నిరంతరం విద్యుత్ కాంతులు
కాళేశ్వరం: కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల్లో విద్యుత్ కాంతులు నిరంతరాయంగా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ అఽధికారులు, సిబ్బంది రాత్రిపగలు శ్రమిస్తున్నారు. ఎస్‌ఈ మల్చూర్ నాయక్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈ శ్రీకాంత్, కాళేశ్వరం లైన్‌ఇన్‌స్పెక్టర్ సదానందం నిరంతరం అందుబాటులో ఉంటూ పనులు త్వరితగతిన చేయిస్తున్నారు. రూ.కోటిన్నరతో కాళేశ్వరంలో మొత్తం 500 వరకు స్తంభాలు, రూ.2 కోట్లతో సబ్‌స్టేషన్‌లో రెండు ఎంవీఐ ట్రాన్స్‌ఫార్మర్లు, 100 కేవీఏ, 25కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు 20 వరకు అమర్చారు. దీంతో కాళేశ్వరం అంతటా 24 గంటల త్రీఫేజ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రోజుకు 50 మంది సిబ్బంది పనులు చేస్తుండగా, పుష్కరాల సందర్భంగా 80 వరకు పెంచుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

నిరంతరం విద్యుత్ కాంతులు