
రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలి
తొర్రూరు: రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్‌కుమార్ తెలిపారు. రాజీ మార్గంలో కేసుల పరిష్కారంపై శుక్రవారం డివిజన్ కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ నెల 19 వరకు చెక్ బౌన్స్ కేసులపై కక్షిదారులతో చర్చిస్తామన్నారు. జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బార్ అధ్యక్షుడు ముకుందారావు, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ప్రతినిధులు మధుసూదన్, ఐలోని, ఏజీపీ లింగాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్‌కుమార్