విద్యుత్‌ షాక్‌తో వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో వృద్ధురాలి మృతి

May 22 2025 12:47 AM | Updated on May 22 2025 12:47 AM

విద్య

విద్యుత్‌ షాక్‌తో వృద్ధురాలి మృతి

ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘటన

13 రోజుల్లో మనుమరాలి పెళ్లి..

అంతలోనే విషాదం

హసన్‌పర్తి: మనుమరాలి పెళ్లికి ఇల్లు శుభ్రం చేస్తున్న క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన హసన్‌పర్తి మండలం జయగిరిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జయగిరికి చెందిన లింగాల నర్సమ్మ(60)కు ఇద్దరు కుమారులు మధు, చంద్రశేఖర్‌ సంతానం. మధు ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందాడు. మధుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ప్రవీణ్‌ ఉన్నారు. మధు మృతి తర్వాత అతడి కుటుంబం బతుకుదెరువు నిమిత్తం రాంపూర్‌ వెళ్లింది. వచ్చే నెల 4న మధు చిన్న కూతురు పెళ్లి జరుగనుంది. జయగిరిలోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఇంటిని ముస్తాబు చేయడానికి ప్రవీణ్‌ జయగిరి వచ్చాడు. బుధవారం నానమ్మ నర్సమ్మతో కలిసి ప్రవీణ్‌ ఇల్లు శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో దండెంపై దుస్తులు ఆరేస్తున్న క్రమంలో నర్సమ్మ విద్యుత్‌ షాక్‌కు గురైంది. గమనించిన ప్రవీణ్‌ ఆమెను రక్షించడానికి యత్నించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ చేరాలు తెలిపారు.

పిడుగుపాటుకు ఇద్దరి మృతి

మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన

కొత్తగూడ/గూడూరు: పిడుగుపాటుకు మహబూబాబాద్‌ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఇందులో ఓ గొర్రెలకాపరి, ఓ యువకుడు ఉన్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడ మండలం ఓటాయికి చెందిన ఏశబోయిన చేరాలు(50) గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. రోజువారీగా గొర్రెలను మేపేందుకు బుధవారం కూడా గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లాడు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా గొర్రెలను తోలుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో పిడుగుపడింది. దీంతో చేరాలు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మైదం సారయ్య కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ (30) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరా అవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళ్లిన ప్రవీణ్‌.. వర్షం వస్తుండడంతో రోడ్డు పక్కన చెట్టు కింద నిలబడ్డాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగుపడడంతో ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో వృద్ధురాలి మృతి
1
1/2

విద్యుత్‌ షాక్‌తో వృద్ధురాలి మృతి

విద్యుత్‌ షాక్‌తో వృద్ధురాలి మృతి
2
2/2

విద్యుత్‌ షాక్‌తో వృద్ధురాలి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement