
ఇస్రో నోడల్ సెంటర్ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల కోఆర్
కేయూ క్యాంపస్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అనుబంధ సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఇస్రో –ఐఆర్‌ఎస్) డెహ్రడూన్ వరంగల్ పాంతీయ కోఆర్డినేటర్లుగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫిజిక్స్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ జితేందర్, డాక్టర్ అలేటి సరిత నియమితులయ్యా రు. ఈ మేరకు ఇస్రో నుంచి సమాచారం అందిందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి బుధవారం తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత హ నుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఇస్రో ఈ కోర్సెస్‌కు సంబంధించి నోడల్ సెంటర్‌గా ఉందన్నారు. విద్యార్థులు ఈ కోర్సెస్ అవకాశాన్ని విని యోగించుకోవాలన్నారు. కాగా, డాక్టర్ జితేందర్, డాక్టర్ సరితను ప్రిన్సిపాల్ జ్యోతి అభినందించారు.
పీజీ సెమిస్టర్ల ఫలితాలు విడుదల
విద్యారణ్యపురి: హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (అటానమస్)లో ఈఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన పీజీ కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను బుధవారం ఆ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి విడుదల చేశారు. పీజీ కోర్సుల్లో మొదటి సెమిస్టర్ల పరీక్షల్లో మొత్తం 85 శాతం, మూడో సెమిస్టర్ పరీక్షల్లో 93శాతం మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారని చంద్రమౌళి తెలిపారు. విద్యార్థినులు తమ ఫలితాలను సంబంధిత కాలేజీ వెబ్‌సైట్‌లోగాని లేదా కళాశాలలోని పరీక్షల విభాగంలో తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి సుహాసిని, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు కె. శ్రీనివాస్, పి. రాజిరెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సురేశ్ బాబు, వివిధ విభాగాల అఽధిపతులు పాల్గొన్నారు.

ఇస్రో నోడల్ సెంటర్ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల కోఆర్