దంతాలపల్లి: కొనుగోలు కేంద్రాల్లోని తమ ధాన్యాన్ని త్వరగా కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని అన్నదాతలు కోరుతున్నారు. మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీలో ధాన్యం కాంటాలు నిర్వహించి తరలించకుండా రోజుల తరబడి నిల్వ ఉంచుతున్నారని తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు శని వారం గొడవకు దిగారు. తండావాసులు తెలిపి న వివరాల ప్రకారం.. మహిళా సంఘం ఆధ్వర్యంలో తండాలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ రైతులకు ధాన్యం కాంటాలు పెట్టకుండా.. బస్తాలు తరలించకుండా ఎవరు కాసులిస్తే వారి ధాన్యం కాంటాలు నిర్వహించి దాన్యాన్ని తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం తండాకు చెందిన మాలోత్ మోహన్ 135 బస్తాలు, గుగులోత్ వెంకన్న 190 బస్తాలు కాంటాలు నిర్వహించి కొనుగోలు కేంద్రంలోనే నిల్వ ఉంచారు. నిర్వాహకులకు చెందిన నర్సింహులపే ట మండలం నాగారం గ్రామానికి చెందిన రై తు ధాన్యం కాంటాలు నిర్వహించి శనివారం వెంటనే లారీలో మిల్లుకు తరలించే ప్రయత్నం చేయగా.. తండావాసులు అడ్డుకున్నారు. ధాన్యంపై కప్పేందుకు ప్రభుత్వం ఇచ్చి న పట్టా(పరదాలు)ను సైతం నిర్వాహకులు తమ కు ఇవ్వకుండా వారి ఇళ్లలోనే దాచి ఉంచా రని రైతులు వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతుల ను సముదాయించారు. పోలీస్‌ల జోక్యంతో శాంతించిన రైతులు ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
స్పాట్ కౌన్సెలింగ్
మహబూబాబాద్ అర్బన్: గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథ మ సంవత్సరంలో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రీజినల్ కోఆర్టినేటర్ గిరిజ నశాఖ కార్యాలయం ఆర్సీఓ టి.హరిసింగ్ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీన ములుగు జిల్లాలో ఏటూరునాగారం స్పోర్ట్స్ స్కూల్‌లో బాలురకు, ఈ నెల 16 తేదీ న ఏటూరునాగారం న్యూఆర్‌జేసీలో బాలికల కు ఉదయం 10 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు పదో తరగతి మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్, కుల, ఆదాయం, నివాసం ఒరిజిల్ సర్టిఫికెట్లు, నాలుగు పాస్ ఫొటోలు, 2 సెట్ల జిరాక్స్‌తో కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌ల్లో అవకాశం ఉందని, విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
9 నెలల తర్వాత కుటుంబం చెంతకు..
ఖమ్మం అర్బన్: మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తికి సపర్యలు చేసి కోలుకున్నాక ఆచూకీ తెలుసుకోవడంతో తొమ్మిది నెలల అనంతరం కుటుంబం చెంతకు చేరాడు. మతిస్థిమితం లేని వ్యక్తి ఖమ్మం నూతన కలెక్టరేట్ వద్ద పడిఉండగా, పోలీసులు ఇచ్చిన సమాచారంతో అన్నం ఫౌండేషన్ బాధ్యులు తమ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. చికిత్స అనంతరం కోలుకున్న సదరు వ్యక్తి తనది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చెట్లముప్పారం అని తన పేరు కాలేరు ప్రవీణ్ అని చెప్పడంతో ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు అంబులెన్స్‌లో శనివారం స్వగ్రామానికి తీసుకెళ్లారు. అయితే, ఆయన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం వరంగల్‌కు వెళ్లగా బాబాయ్ వీరేశంకు అప్పగించారు. గత వర్షాకాలంలో ప్రవీణ్ ఇంటి నుంచి తప్పిపోయాడని, మళ్లీ రావడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.

లారీని అడ్డుకుని రైతుల ఆందోళన