
పనులకు వెళ్లొస్తూ పరలోకాలకు..
రాయపర్తి: మహిళా కూలీలతో వస్తున్న ఓ ఆటోను బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ కూలీ మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మండలంలోని కొలన్‌పల్లి శివారులో చోటు చేసుకుంది. ఎస్సై శ్రవణ్‌కుమార్ కథనం ప్రకారం.. రాయపర్తి మండలంలోని కొలన్‌పల్లి శివారు జయరాంతండా(కె) గ్రామానికి చెందిన లావుడ్య బిచ్చాని(45), లావుడ్య చావ్లి, లావుడ్య బికీ, లావుడ్య సువాలి కూలీ పనుల నిమిత్తం పాలకుర్తి వెళ్లారు. పనులు పూర్తయిన అనంతరం గ్రామానికి వస్తున్న క్రమంలో కొలన్‌పల్లి శివారులో బొలెరో ఎదురుగా ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బిచ్చాని మృతి చెందింది. ముగ్గురు క్షతగాత్రులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్‌కుమార్ తెలిపారు.
ఆటోను ఢీకొన్న బొలెరో..
మహిళా కూలీ మృతి
ముగ్గురికి గాయాలు