
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
కాళేశ్వరం : సరస్వతీనది పుష్కరాల్లో పాల్గొనేందుకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వర పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, సీఎం భద్రతా అధికారి వాసుదేవరెడ్డి తెలిపారు. బుధవారం కాళేశ్వరంలోని ఈఓ కార్యాలయంలో సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా గురువా రం సాయంత్రం 5 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారని తెలిపారు. సీఎం ప్రయాణించే మార్గంలో పోలీస్ బందోబస్తు, బాంబ్ స్క్వాడ్, ట్రాఫిక్ కంట్రోల్, ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్‌డీఓ రవి, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా
ఎస్‌హెచ్‌జీ హ్యాండ్లూమ్ స్టాళ్లు..
కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల్లో మహిళా స్వయం సహాయ సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ ఉత్పత్తుల స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ స్టాళ్ల పర్యవేక్షణకు డీఆర్‌డీఓ నరేశ్, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థను కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేకాధికారులుగా నియమించారు. టెక్స్‌టైల్, హ్యాండ్లూమ్ స్టాళ్లలో పట్టు చీరలు, నూలు వస్త్రాలు, డిజైన్ దుస్తులు, చేనేత వస్త్రాలతోపాటు ప్రత్యేక కలెక్షన్ వస్త్రాలు ప్రదర్శిస్తారని అధికారులు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు తక్కువ ధరల్లో, నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని, ఈ స్టాళ్ల ఏర్పాటుతో ఎస్‌హెచ్‌జీలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు