
పుష్కరాలకు ఆర్టీసీ సన్నద్ధం..
హన్మకొండ/కాళేశ్వరం: ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతీనది పుష్కరా లకు టీజీఎస్ ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ మేరకు ఆర్టీసీ వరంగల్ రీజియన్ యాజమాన్యం, అధికా రులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానా లకు చేరవేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ప్రతీ రోజు 140 బస్సులకు తగ్గకుండా నడిపేందుకు ప్రణాళిక సి ద్ధం చేశారు. భక్తుల సంఖ్య పెరిగితే మరిన్ని అదనపు బస్సులు నడిపేందు కు సిద్ధంగా ఉన్నారు. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి 40 బస్సులు, వరంగల్ బస్ స్టేషన్ నుంచి 25, జనగామ, పరకాల, నర్సంపేట బస్ స్టేషన్ నుంచి 10 చొప్పున, భూపాలపల్లి నుంచి 20, తొర్రూరు, మహబూబాబాద్ బస్ స్టేషన్ నుంచి 5 చొప్పున, హైదరాబాద్ నుంచి 15 ప్రత్యే క బస్సులు నడిపేలా కార్యాచరణ రూపొందించారు. అదే విధంగా హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు నడుపనున్నారు. ఏసీ బస్సులకు హైదరా బాద్ నుంచి రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఈ నెల 13 నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు. సరస్వతీనది పుష్కరాలు జరిగే కాళేశ్వరంలో నాలుగు ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. మొత్తం 9 పాయింట్లు ఉంటాయి. 9 పాయింట్ల నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు బయలుదేరుతాయి. కాళేశ్వరంలో ఇద్దరు అధికారులు, 10 మంది సూపర్ వైజర్లు, 20 మంది వలంటీర్లు నిరంతరాయంగా సేవలు అందిస్తారు. ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, సరస్వతీనది పుష్కరాలకు చార్జీలు ఖరారు చేశారు. సాధారణ చార్జీలతో చూసుకుంటే ఒకటిన్నర రెట్లు చార్జీలు పెంచారు.
రూట్‌ల వారీగా ప్రత్యేక బస్సుల చార్జీల వివరాలు ఇలా..
రూట్ బస్సు సర్వీస్ పెద్దలకు పిల్లలకు
(రూ.) (రూ.)
హనుమకొండ – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 250 140
ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ 260 150
డీలక్స్ 290 160
ఎలక్ట్రిక్ డీలక్స్ 310 180
సూపర్ లగ్జరీ 330 190
ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ 350 210
రాజధాని 420 330
గరుడ (+) 500 380
నర్సంపేట – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 330 180
మహబూబాబాద్ – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 400 220
తొర్రూరు – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 360 190
జనగామ – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 390 220
భూపాలపల్లి –కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 120 70
సూపర్ లగ్జరీ 160 100
పరకాల – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 190 110
హైదరాబాద్ – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 570 320
డీలక్స్ 670 370
సూపర్ లగ్జరీ 760 420
రాజధాని 960 740
గరుడ (+) 1130 870
ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
సరస్వతీనది పుష్కరాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ సేవలు సద్వి నియోగం చేసుకోవాలి. భక్తులను చేరవేసేందుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. భద్రతతో కూడిన సౌకర్యవంత ప్రయాణం అందిస్తాం. అవసరమైతే బస్సుల సంఖ్య పెంచుతాం. అధికారుల నిరంతర పర్యవేక్షణలో సురక్షితంగా, క్షేమంగా భక్తులను చేరవేస్తాం.
డి.విజయభాను, రీజినల్ మేనేజర్, వరంగల్
●
ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు
రోజుకు 140 ట్రిప్పులు.. భక్తుల సంఖ్య పెరిగితే
మరిన్ని అదనపు సర్వీసులు
ఏసీ బస్సులకు హైదరాబాద్ నుంచి
రిజర్వేషన్ సౌకర్యం
చార్జీలు ఖరారు చేసిన అధికారులు

పుష్కరాలకు ఆర్టీసీ సన్నద్ధం..