
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
మహబూబాబాద్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇతర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ధాన్యం కొనుగోళ్లు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలన్నారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. 48గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోలు పెరిగిందన్నారు. జిల్లాలో 1.16లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, దానిలో 1,03,000 మెట్రిక్‌టన్నులు మిల్లులకు తరలించినట్లు చెప్పారు. వీసీలోజిల్లా నుంచి కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి ఉన్నారు.
వీసీలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి