
పుష్కర స్నానంతో పొరపాట్లు పరిసమాప్తం
కాళేశ్వరం: పుష్కర స్నానంతో సకల సౌకర్యాలు, సౌభాగ్యాలు కలుగుతాయని, ఏవైనా పొరపాట్లు, తప్పులు జరిగి ఉంటే పరిసమాప్తమవుతాయని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సాయంత్రం కాళేశ్వరంలో కుటుంబ సమేతంగా డిప్యూటీ సీఎం పుష్కర పుణ్యస్నానం ఆచరించారు. సరస్వతిఘాట్ వద్ద ఏర్పాటు చేసిన హారతి కార్యక్రమాన్ని వీక్షించారు. అంతకుముందు ఏకశిల సరస్వ తీమాత విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ భద్రత, పా రిశుద్ధ్యం, స్నానాల ఘాట్ల వద్ద అధికారులు నిబద్ధ త, నిష్టతో ఏర్పాట్లు చేశారని వివరించారు. పుష్కర స్నానాలకు ప్రతీరోజు ఒక పీఠాధిపతి వచ్చి స్నానం ఆచరించి ముక్తేశ్వర దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం వెంట మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనా రాయణరావు, రాజ్‌ఠాకూర్, కలెక్టర్ రాహుల్‌శర్మ, దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావ్ ఉన్నారు. కాగా, రాత్రి హోటల్ హరితలో బస చేశారు. శనివారం ఉదయం కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కాళేశ్వరంలో పుష్కరస్నానం