రైతులకు అండగా ప్రభుత్వం
మరిపెడ: ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్‌కుమార్ అన్నారు. మరిపెడ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మరిపెడలో గత యాసంగి సీజన్ కంటే ప్రస్తుతం అధికంగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 75శాతం ధాన్యం సేకరణ పూర్తయినట్లు తెలిపారు. కలెక్టర్ నిత్యం అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రత్యేకాధికారులు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారి కిరణ్‌కుమార్, డీపీఆర్‌ఓ రాజేంద్రప్రసాద్, తహసీల్దార్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


