
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
కురవి: మండలంలోని బలపాల గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మహబూబాబాద్ విద్యుత్ శాఖ డీఈ విజయ్ అన్నారు. గురువారం బలపాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, బంచరాయి, ఎస్సీ కాలనీలను సందర్శించి అక్కడి విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బంచరాయిలో విద్యుత్ వైర్లు అపహరణకు గురికాగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మిడిల్ పోల్స్, కొత్త ట్రాన్స్‌ఫార్మర్, పాఠశాలలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యుత్ వైర్లు చోరీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ వరకు స్తంభాలు ఏర్పాటు, రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను తొలగిస్తామని తెలిపారు. ఏఈఈ శారద, లైన్‌మన్ కపిల్, గణేశ్, ఉప్పయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, పాఠశాల హెచ్‌ఎం సునీత, ప్రసాద్, మదన్, మోహన్, వెంకటేశ్వర్లు, నరేశ్,మంగయ్య, రాంకోటి, ఈదయ్య, రమేశ్, వీరభద్రం, వెంకటేశ్, శ్రీను, ఆనందం పాల్గొన్నారు.