
వర్షాలు వచ్చేనాటికి మరమ్మతులు చేయాలి
మా గ్రామంలోని పెద్ద చెరువు, పక్కన ఉన్న రావిరాల పెద్ద చెరువు కట్టలు పూర్తిగా తెగిపోయి. ఇప్పటికి రెండు పంటలు లాస్ అయ్యాం. చెరువు కట్ట కింద వందల మంది రైతులు వేల ఎకరాల్లో సాగు ఆగమైపోయింది. ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. తెగిపోయిన చెరువులను తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. చెరువుల్లో నీరు లేకపోవడం వల్ల వ్యవసాయ బావులు, బోర్లలో నీరు ఇంకిపోయి చెరువు కిందే కాకుండా చుట్టుపక్కల కూడా పంటలు పండే పరిస్థితి లేదు.
– రాపాక వీరభద్రయ్య, రైతు, సీతారాంపురం