
మెరిసిన రైతు బిడ్డ..
● స్టేట్ 404వ ర్యాంకు సాధించిన స్వాతి
నెల్లికుదురు: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన టీజీ ఎప్‌సెట్ ఫలితాల్లో రైతు బిడ్డ మెరిసింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామానికి చెందిన బొమ్మెర స్వాతి 97.26 మార్కులు సాధించి స్టేట్ 404 ర్యాంకర్‌గా నిలిచింది. గ్రామానికి చెందిన బొమ్మెర ఉప్పలయ్య, సారమ్మ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. తమకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. స్వాతి 10వ తరగతి కల్లెడలోని ఆర్‌డీఎఫ్ హైస్కూల్‌లో, ఇంటర్మీడియట్ కల్లెడలోని వీఏపీవి కళాశాలలో చదివింది. కాగా, డాక్టర్ కావడమే తన లక్ష్యమని స్వాతి తెలిపింది. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు స్వాతిని అభినందించారు.